Bimbisara, Karthikeya-2..streaming this month itself
mictv telugu

బింబిసార, కార్తికేయ-2..ఈ నెలలోనే స్ట్రీమింగ్

September 20, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో కరోనా తర్వాత పెను మార్పులు చోటుచేసుకున్నాయి. యువ హీరోలు, నిర్మాతలు, యువ డైరెకర్లు తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన కథలతో కూడిన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైతే, పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ దాదాపుగా థియేటర్లలోనే విడుదలవుతున్నాయి. దీంతో వారం వారం సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదల అవుతుందని, ఆ తర్వాత ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవలే థియేటర్లలో విడుదలై, దక్షిణాది సినీ ప్రియులనే కాకుండా, ఉత్తరాది ప్రేక్షకుల మదిని దొచుకున్న బింబిసార, కార్తికేయ-2 సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ రెండు చిత్రాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయని ఉదయం, సాయంత్రం అప్డేట్లు వెతుకుతున్నారు. అటువంటివారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే స్ట్రీమింగ్ కానున్నాయని జీ5 తెలియజేసింది. ”మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్‌ మీడియా ఖాతాలను అనుసరించండి” అని ట్విటర్‌లో రాసుకొచ్చింది.

అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం…కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ను సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని, ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే ఈ నెల 30న స్ట్రీమింగ్ కచ్చితంగా అవుతుందని తెలుస్తోంది. ఇక, ‘కార్తికేయ-2’ విషయానికొస్తే..హీరో నిఖిల్ కేరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్టుగా నిలిచింది. ఈ సినిమాను దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కుదిరితే, ఈ నెల ఆఖర్లో గాని అక్టోబరు 1వ తేదీన స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.