లాడెన్ వారసుడికి అంత సీనుందా... - MicTv.in - Telugu News
mictv telugu

లాడెన్ వారసుడికి అంత సీనుందా…

May 29, 2017

లాడెన్ పోయాడు.అల్ ఖైదా పనైపోయింది. కానీ ఇప్పుడిప్పుడే గుహ నుంచి సింహాం బయటికొచ్చింది.లాడెన్ చల్లిన విత్తుల్లో మొక్క పెరిగి పెద్దదై ఉగ్రరూపం దాల్చిందట. ఉగ్ర ఉరుములు ఉరుముతుందట. ఇంతకీ గుహ నుంచి వచ్చిన ఉగ్ర సింహాం ఎవరు..లాడెన్ కి ఏమవుతాడు..వాడికి అంత సీనుందా…
అమెరికాని వణికించిన ఉగ్రసంస్థ అల్ ఖైదుకు వారసుడొచ్చాడు. మామూలోడు కాదు..నరహంతక ముఠాలో రాటు దేలినోడు. మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు ఒసామా బిన్‌ లాడెన్‌ కొడుకు 28 ఏళ్ల హమ్జా బిన్‌ లాడెన్‌ గుహ నుంచి బయటకొచ్చి అల్ ఖైదా పగ్గాలు చేపట్టాడు. ఇదంతా నిఘా వర్గాలు ద్రువీకరిస్తున్న తాజా రిపోర్టులు. వివిధ ఉగ్రసంస్ధల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే ఐసిస్ సతమతవుతోన్నప్రపంచదేశాలకు అలైఖైదాకు వారుసుడు రావడం మరింత ఆందోళన పరురుస్తోంది.

లాడెన్ తోనే అంతమైపోయిన అల్ ఖైదా మళ్లీ స్ట్రాంగ్ కాకుండా హమ్జా కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఒసామా బిన్‌ లాడెన్‌ మహ్మద్‌ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి. దీంతో ఒసామా కొడుకు హమ్జా పిలుపునిస్తే ఎక్కువమంది ముస్లిం యువత సంస్ధలో చేరి ప్రాణత్యాగానికి సిద్ధపడతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచదేశాల్లో మరింత భయం పెరుగుతోంది. గతరెండేళ్లలో యూరప్‌ ఖండంలో అత్యధిక సార్లు ఉగ్రదాడులు జరిగాయి. అల్‌ఖైదా మళ్లీ పురుడు పోసుకుందనే ఉగ్రకబురు ఆ దేశ వాసుల్ని భయపెడుతోంది.

లాడెన్ కు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్‌ కొడుకు. ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు.
సౌదీ అరేబియాకు చెందిన ఆమె మహమ్మద్‌ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల దగ్గరేపెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌లలో కూడా ఉన్నాడు. హమ్జాకు కూడా వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారట. హమ్జా ఎదిగిన తర్వాతి ఫోటో ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా బయటకు వచ్చింది.

అమెరికాలో దాడుల తర్వాత బిన్‌ లాడెన్‌, ఇతర అనుచరులు తూర్పు అఫ్ఘానిస్థాన్‌లోని తోరాబోరా కొండల్లో దాక్కున్నారు. అప్పుడే లాడెన్ భార్యాపిల్లలను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు పంపించి వేశాడు.ఆ తర్వాత హమ్జా తండ్రిని కలిసింది లేదు. ఇరాన్‌లో దాదాపుగా గృహ నిర్బంధంలో ఉండేవాడు. దీనిపై అసంతృప్తి చెందుతూ మొజాహిదీన్‌గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2009లో లాడెన్ కు పెద్ద లెటర్ రాశాడు. ఉగ్ర పోరాటాలతో సాధ్యమైనన్ని మార్గాల్లో ఆయా దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు హమ్జా చెబుతున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.