జనవరిలో అయ్యప్పను దర్శించుకున్న బిందు ఇప్పుడు ఆస్పత్రిపాలు - MicTv.in - Telugu News
mictv telugu

జనవరిలో అయ్యప్పను దర్శించుకున్న బిందు ఇప్పుడు ఆస్పత్రిపాలు

November 26, 2019

శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినప్పటి నుంచి ఉద్రిక్తతో కొనసాగుతూనే ఉంది. భక్తుల విశ్వాసాలు దెబ్బతినేలా కావాలని మహిళలు ఆలయ ప్రవేశం చేయకూడదని కొంత మంది వాదిస్తుంటే.. మరి కొంత మంది మహిళలు మాత్రం ఎలాగైనా దర్శనం చేసుకొని తీరుతామంటున్నారు. ఇది ఇరు పక్షాల మధ్య ఘర్షణకు దారి తీసింది.

అలాగే ధర్మాసనం ఆదేశాలతో 2019 జనవరి 2న బిందు అనే కేరళ మహిళ అయ్యప్పను దర్శించుకుంది. మళ్ళీ ఈ ఏడాది  దర్శనం కోసం ఆమె ప్రయత్నించగా అయ్యప్ప భక్తులు కారంపొడి చల్లి దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ఎదుట ఈ దాడి జరిగింది. సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్‌తో కలిసి శబరిమల వెళ్లేందుకు బిందు సిద్ధమైంది. ఇద్దరూ కలిసి తమకు పోలీసుల  రక్షణ కావాలని కోరారు. వారిని చూసిన అయ్యప్ప భక్తులు పెప్పర్ స్ప్రే, కారంపొడి చల్లి దాడి చేశారు. 

Ayyappa Temple.

తమ హక్కుల ప్రకారం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అమలు చేయడం లేదని బిందు మండిపడ్డారు. ఎలాగైనా తాము అయ్యప్పను దర్శించుకొని తీరుతామని స్పష్టం చేశారు.  కాగా ఇప్పటికే కేరళ ప్రభుత్వం సంచలనాల కోసం అయ్యప్ప దర్శనానికి వచ్చే వారికి రక్షణ కల్పించేది లేదని తేల్చి చెప్పింది. భక్తితో మండలం రోజుల పాటు పూజలు చేసిన వారికి దర్శనం కల్పిస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో తృప్తిదేశాయ్, బిందు ఆలయ ప్రవేశానికి వస్తుండటంతో మరోసారి పోలీసులు అప్రమత్తం అయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు ప్రారంభించారు.