జనవరి 3వరకు కల్వకుంట్ల మిలన్ రావును అరెస్ట్ చేయొద్దు..హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

జనవరి 3వరకు కల్వకుంట్ల మిలన్ రావును అరెస్ట్ చేయొద్దు..హైకోర్టు

December 12, 2019

kalvakuntla krishna milan rao.

ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి దగ్గర ఉన్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాద కేసులో నిందితుడైన కల్వకుంట్ల కృష్ణమిలన్ రావుని ఈనెల 12వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే. ఈ నెల 10న విచారించిన హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణ వరకు అతణ్ని అరెస్ట్ చేయకూడదని పొలీసులకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా రాయదుర్గం పోలీసులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. జనవరి 3 వరకు అతణ్ణి అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. 

కారు ప్రమాదం చేసిన వ్యక్తిపై 304(2) ఎలా పెడతారని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి కృష్ణమిలన్‌రావే కారణమని రాయదుర్గం పోలీసులు హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రమాదం సమయంలో 104కిపైగా స్పీడ్‌తో ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వంతెనపై స్పీడ్ లిమిట్ కేవలం 40 కిమీ మాత్రమేనని..కానీ, ఓవర్‌ స్పీడ్‌తో డ్రైవ్‌ చేసి ఒకరి మృతికి కారణమైన కృష్ణ మిలన్‌రావు అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఫ్లైఓవర్‌ డిజైన్‌ లోపమే ప్రమాదానికి కారణమని కృష్ణమిలన్‌రావు కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రమాదంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో మిలన్ రావు ప్రమాదం నుంచి చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. అతడు ఓ ప్రైవేటు కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు.