biopic of Lata Bhagwan Kare from Maharashtra in the Pan India range
mictv telugu

పాన్ ఇండియా రేంజ్‌లో వృద్ధురాలి బయోపిక్

May 17, 2022

biopic of Lata Bhagwan Kare from Maharashtra in the Pan India range

మహారాష్ట్రకి చెందిన ఓ 65 ఏండ్ల మహిళ జీవితం ఆధారంగా బయోపిక్ తీసి జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్నాడు ఓ తెలుగోడు. కాకపోతే అది తెలుగు సినిమా కాదు.. మరాఠీ సినిమా. ఈ చిత్రానికి నిర్మాత కూడా మనోడే. కరీంనగర్ జిల్లాకు చెందిన నవీన్ దేశబోయిన, ఎర్రబోతు కృష్ణ లు దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన సినిమా ‘లతా భగవాన్‌ కారే’. భర్త ఆరోగ్యం క్షీణించడంతో… అతనికి మెరుగైన వైద్యం అందించడానికి ఎస్‌కె మారథాన్‌ రేస్‌లో పాల్గొని, గెలిచిన 65ఏళ్ల మహిళ లతా కారే జీవితం ఆధారంగా తీసిందే ఈ చిత్రం. ఈ సినిమా 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది.

ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, సినిమా రీమేక్‌ను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తామని చెప్పారు దర్శకుడు నవీన్ దేశబోయిన. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత ఎర్రబోతు కృష్ణ తెలిపారు.