బయోపిక్ లంటే భయమెందుకు ? - MicTv.in - Telugu News
mictv telugu

బయోపిక్ లంటే భయమెందుకు ?

June 9, 2017

ఇప్పుడు అంతా బయోపిక్ సిన్మల ట్రెండ్ నడుస్తుంది…హిందీ సిన్మోల్లు మాత్రం గీ బయోపిక్ లు తీసుట్ల మస్తు ముందున్నరు..ఇప్పటికే  చాలామంది వ్యక్తిగతాన్ని సిన్మాలుగా తీసి మంచి వసూళ్లను రాబట్టుకున్రు ,బాగ్ మిల్కా బాగ్ ,మేరీ కోమ్,డర్టీ పిక్చర్,దంగల్,సచిన్ ఎ బిలీనియర్స్ డ్రీమ్ ఇలా..ఎన్నో సినిమాలు తీశారు దాదాపు అన్ని హిట్లే,మరి మన తెల్గు సిన్మోళ్లు  బయోపిక్ లను తీయడానికి ఎందుకు ముందుకు అస్తలేరో అర్ధమైతలేదు…బయోపిక్ సిన్మ తీసేంత గొప్పవాళ్లు ఇక్కడ ఎవ్వలు లేరని వాళ్ల అభిఫ్రాయమో లేక్పోతే…బయోపిక్ సిన్మలు  మన బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడ్తాయనే భయమో…ఈగడ్డమీద ఎందరో గొప్పవాళ్లు పుట్టారు చరిత్ర సృష్టించిన వాళ్లున్నరు, బీదకుటుంబంలో పుట్టి కష్టపడి పైకచ్చిన వాళ్ల విజయగాథలెన్నో..ఇవన్ని మన సిన్మోళ‌్లకు కనిపించవు,చిన్నవయసుల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తెలంగాణ బిడ్డ పూర్ణ జీవితాన్ని సిన్మ దీస్తమని ఎక్కడో వున్న హిందో సిన్మోల్లు వచ్చిన్రు..కనీ మన తెలంగాణ బిడ్డ సాదించిన విజయగాథ..పక్కనే ఉన్న మన తెల్గుసిన్మోళ్లకు కనబడలేదు,రుద్రమదేవి ,అన్నమయ్య..గౌతమీపుత్ర శాతకర్ణి ఇలా కొన్ని సిన్మలు వచ్చినా…వాటిలో కూడా కమర్శియల్ జోడించి కొన్ని సిన్మలను కిచిడీ జేశిన్రు…అరె ‎ఘాజీ అనే గొప్ప సిన్మదీశ్న దర్శకుడు మనతెలుగువాడే కదా..ఆ సినిమా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండ హిట్ గొట్టలేదా ఆ దైర్యం చాలదా మనతెల్గు సిన్మోళ్లకు.

పంచ్ డైలాగులు ,ఐటమ్ సాంగులు,అతి అనిపించే హీరోయిజం,హీరోయిన్ల అందచందాలు,కుల్లు కామెడీ ఇవి ఉంటేనే పబ్లిక్ సిన్మలు చూస్తారనే బ్రమలో సిన్మలు తీస్తున్నరు ముందు అందులోంచి బైటికిరండి…మనగడ్డమీద పుట్టి చరిత్ర సృష్టించి కనుమరుపోయిన గొప్పవాళ్లు..కష్టపడి పైకొచ్చినోళ్ళ విజయగాథలు మనదగ్గర చాలా ఉన్నాయి,ఒక్కసారి వాటిలోకి తొంగిచూడండి…ఎంతసేపు వేరే భాషల సిన్మలు ఏం మంచిగున్నయ్..అవ్విటిని ఎట్ల కాపీగొడదాం అనే ఆలోచలను పక్కకు వెట్టి ,మంచి సిన్మలు తీయండి..మేం చూడడానికి రెడీ..హిట్ సినిమాలను కాపీ కొట్టడానికి ముందువరుసలో ఉండే మీరు… బయోపిక్ అనే హిట్ ఫా ర్ములాను కూడా కాపీ కొట్టండి. కాపీ కొట్టడం మీకు బాగా అలవాటే కదా..అందుకే చెబుతున్నాం.ఇదేదో మీరు మంచి సినిమాలు తియ్యట్లేదనే బాదతో్ చెబుతుంది కాదు…వచ్చాయి మంచి సినిమాలు చాలానే వచ్చాయి ,ఇంకా రావాలి ఇంకా ఇంకా రావాలి…మంచి సినిమాలకు కేరఫ్ అడ్రస్ తెలుగు సినిమా అనే రేంజ్ లో రావాలి.. రెగ్యులర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన ప్రతి ఒక్కరి ఆశ కూడా ఇదే.