ఆటగాళ్ళపై ‘ఆట’లు!

యిప్పుడు బాలీవుడ్  సహా భారతీయ సినీ పరిశ్రమ మొత్తం స్పోర్ట్ బయోపిక్స్ వెంటబడుతోంది. లెజండరీ రన్నింగ్ సన్సెషన్ పీటీ ఉష జీవితం ఆధారంగా ఓ చిత్రం రాబోతోందని వార్త. ఆ పాత్రను ప్రియాంక చోప్రా పోషిస్తోందట. యిప్పటికే బాక్పింగ్ సన్సేషన్ మేరీకోమ్ చిత్రంలో టైటిల్ రోల్ చేసి మంచి పేరు తెచ్చుకుంది ప్రియాంక. షారుఖ్ ఖాన్ నటించిన ‘చెక్ దే ఇండియా’తో ఈ ట్రెండ్ మొదలయింది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘పాన్ సింగ్ తోమర్’, ఫర్హాన్ అక్తర్ నటించిన ‘బాగ్ మిల్కాబాగ్’, అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’, సుశాంత్ సింగ్ రాజ్పుట్ నటించిన ‘ఎమ్ ధోనీ ఎన్ అన్ టోల్డ్ స్టోరీ’, ఇమ్రాన్ హష్మి నటించి ‘అజార్’ ఆ కోవలోకే వస్తాయి. ఈ మధ్యే సచిన్ మీద ఓ డాక్యుమెంటరీ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలానే విడుదలయింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ మీద కూడా ఓ చిత్రం రాబోతోంది. సానియా మీర్జా మీద కూడా ఓ సినిమా తీయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన పాత్రను దీపికా పడుకోణె పోషించాలని సానియా మీడియా ముందు తన అభిప్రాయాన్ని చెప్పేసింది.

తెలుగులో అయితే బాట్మింటెన్ సన్సేషన్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో  ఓ చిత్రం రూపొందుతోంది. అప్పట్లో అశ్వనీ నాచప్ప మీద ఓ సినిమా వచ్చింది.అం దులో ఆమే నటించటం విశేషం.యిప్పుడు ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మీద కూడా ఓ చిత్రం రాబోతోంది. క్రీడాకారుల జీవితాల్లో ఒకటు సగటు మనిషికి జీవితానికి అవసరమయ్యే క్రీడా స్ఫూర్తి వుండటం, స్పోర్ట్స్ సెలబ్రెటీకి వున్న క్రేజ్ కారణంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే కధలకి కమర్షియల్ సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ వుండటమే ఈ ట్రెండ్ కి ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

 

SHARE