నేను కన్నాను, నేను ప్రాణంగా సాకాను.. నిజామాబాద్‌లో ఇద్దరు తల్లుల వేదన - MicTv.in - Telugu News
mictv telugu

నేను కన్నాను, నేను ప్రాణంగా సాకాను.. నిజామాబాద్‌లో ఇద్దరు తల్లుల వేదన

June 2, 2022

నాలుగు నెలల ఓ చిన్నారి బాలుడు కోసం ఇద్దరు తల్లులు ఆరాటపడుతున్నారు. తమకే ఆ బాలుడు కావాలంటూ పోరాడుతున్నారు. నిజమాబాద్ నగరం లోని ఆనంద్ నగర్ కాలనీలో 4 నెలల బాబు కోసం కన్నతల్లి ఇందిర ఆందోళన బాట పడితే.. పెంచిన తల్లి సునీత మమకారం వదులుకోలేక చిన్నారి కోసం పోరాడుతోంది. నాలుగు నెలల క్రితం ఆ బాలుడికి జన్మనిచ్చిన ఇందిర … తన సోదరి స్వప్నతో కలసి రూ. 40 వేల కు సునీతకు విక్రయించింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ తన బిడ్డ తనకే కావాలంటూ… పెంచిన తల్లి సునీత ఇంటి ముందు ఆందోళన చేపట్టింది.

బిడ్డను కన్న బిడ్డకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్న సునీత తన బిడ్డ తనకే కావాలంటూ వాగ్వాదానికి దిగింది. పిల్లాడిని డబ్బులు ఇచ్చి కొనే సమయంలో తాము రాతపూర్వకంగా బిడ్డను తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కన్నతల్లి ఇందిర ఐదో టౌన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.