మహా సముద్రంలో బిడ్డకు జన్మ.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

మహా సముద్రంలో బిడ్డకు జన్మ.. వీడియో వైరల్

June 5, 2022

నికారగువాలోని ప్లాయా మజగువాల్ సముద్ర తీరంలో ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డను చూసుకుంటూ నొప్పిని సైతం మరిచి బిడ్డను ముద్దాడిన వీడియో నెటిజన్స్‌ కళ్లల్లో ఆనందభాష్పాలను కురిపిస్తుంది.

 

వివరాల్లోకి వెళ్తే.. జోసీ ప్యూకర్ట్ (37) అనే యువతి షేర్ చేసిన వీడియోలో..’ నికారగువాలోని ప్లాయా మజగువాల్ సముద్ర తీరంలో ఓ యువతి నిండు గర్భంతో నీళ్లలో కుర్చొని ఉంది. సముద్ర అలలు ఆమెను తాకుతుండగా, నొప్పులను భరిస్తూ, ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే ఆనందంతో కన్నీరు కారుస్తూ, ముద్దాడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ఒక్కసారి కూడా స్కానింగ్ తీయించుకోలేదట. కానీ, డెలివరీ సేఫ్‌గా జరిగేలా అవసరమైన రీసెర్చ్ అంతా చేసుకున్నాదట. ఇక వీడియోను వీక్షిస్తున్న వారంతా ఆ తల్లి బిడ్డకు జన్మను ఇవ్వడానికి పడిన కష్టాన్ని చూసి, శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

పెళ్లి అయిన ప్రతి మహిళకు తల్లి కావడం అనేది ఓ గొప్ప వరం. తాను తల్లి కాబోతున్నాను అని తెలిసినా ఆ క్షణం నుంచే తెగ ఆనందపడుతూ, బిడ్డ క్షేమం కోసం 9 నెలలపాటు అనేక చర్యలు తీసుకుంటుంది. డాక్టర్ల దగ్గరకు వెళ్లి, బిడ్డకు ఎలాంటి అపాయం జరగకుండా మందులు వేసుకుంటుంది. కొంతమంది మహిళలు స్కానింగ్ చేయించి, బిడ్డ ఎదుగుదలను తెలుసుకుంటారు. ఇవేవి లేకుండా జోసీ ప్యూకర్ట్ (37) అనే యువతి బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. ఏ డాక్టర్ దగ్గరకు ఆమె వెళ్ళలేదు. ఏలాంటి స్కానింగ్ చేయించుకోలేదు. ఆసుప్రతిలోనే, ఇంట్లోనే కాకుడా ఆమె డెలవీరిని పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి మెడికల్ సహకారం లేకుండా బిడ్డకు జన్మనివ్వడం అమ్మ ప్రేమకు సాటేది లేదని మరోసారి నిరూపించింది.