సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నేడు. 1935 జులై 25న జన్మించిన కైకాల 87వ వసంతలోకి అడుగుపెట్టారు. కైకాల బర్త్ డే నేపథ్యంలో అభిమానులు, చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కైకాలను ప్రత్యేకంగా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ఆయన్ని కలిశారు. కైకాల నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయన చేత కేక్ కట్ చేయించారు. దీంతో కైకాల సంతోషం వ్యక్తం చేశారు.
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022
‘పెద్దలు, శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టిన రోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.చిరంజీవి, కైకాల కాంబినేషన్ లో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. చిరంజీవి చిత్రాల్లో కైకాల విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, కమెడియన్ గా కూడా చేశారు. చివరగా కైకాల ‘N.T.R కథానాయకుడు’, ‘మహర్షి’ సినిమాల్లో నటించాడు. కొన్నాళ్లుగా వయో సంబంధింత సమస్యలతో బాధపడుతున్న కైకాల ఇంటికే పరిమితం అవుతున్నారు. గత ఏడాది ఆయన ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక లేటెస్ట్ ఫోటోస్ గమనిస్తే కైకాల బెడ్ కే పరిమితమయ్యారని తెలుస్తుంది.