కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు. గతేడాది అల్లూరి లాంటి మాస్ కమర్షియల్ సినిమాతో ముందుకొచ్చిన శ్రీ విష్ణు.. యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు కానీ, సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు తనకు బాగా నప్పే లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఏకే ఎంటర్తైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ, మేకర్స్ ‘సామజవరగన’ టైటిల్ ని ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా శ్రీవిష్ణు పుట్టిన రోజు కావడంతో ఈరోజు ‘సామజవరగమన’ సినిమా గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికీ కాస్ట్ ప్రాబ్లమ్స్, లేదా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నాకేంటి ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీవిష్ణు తనదైన యాసలో డైలాగ్ చెప్పిన విధానం నవ్వించింది.
లవ్ మ్యారేజ్ కి కూడా ఇటువంటి ఒక ప్రాబ్లెమ్ ఉంటుందా ?🤔
Here's the Birthday Glimpse of @sreevishnuoffl from #Samajavaragamana 🥳
– https://t.co/wpBD9CGoF5#HBDSreeVishnu ✨@Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @GopiSundarOffl @HasyaMovies pic.twitter.com/8VbkkzK4wT
— AK Entertainments (@AKentsOfficial) February 28, 2023
ప్రేమ, పెళ్లి వరకూ బాగానే ఉంది కానీ ఇంతకీ అసలు శ్రీవిష్ణుకి వచ్చిన సమస్య ఏంటి అనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ లో కూడా “లవ్ మ్యారేజ్ కి కూడా ఇటువంటి ఒక ప్రాబ్లెమ్ ఉంటుందా ?” అన్నారు కానీ ఆ ప్రాబ్లమ్ ఏంటో చెప్పలేదు. మంచి క్యురియాసిటీ క్రియేట్ చేస్తున్న చిత్ర యూనిట్, టీజర్ లో అయినా శ్రీవిష్ణుకి వచ్చిన సమస్య ఏంటో చెప్తారేమో చూడాలి. సామజవరగమనా సినిమాలో హీరోయిన్ గా… ‘విజిల్’ సినిమాలో ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబాజాన్ నటిస్తోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.