పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లులను చూసి సూపరింటెండెంట్ అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ బర్ధామన్ జిల్లా కత్వా సబ్ డివిజన్ ఆస్పత్రికి కింగ్ షూక్ గోష్ అనే కాంట్రాక్టర్ ఫర్నీచర్, వాహనాలతోపాటు బిర్యానీని సరఫరా చేస్తుంటాడు. ఇటీవలే ఆస్పత్రికి సౌవిక్ ఆలం అనే కొత్త సూపరింటెండెంట్ నియామకం అయ్యారు. కాంట్రాక్టర్ రూ. కోటి విలువ చేసే బిల్లులను సూపరింటెండెంట్ ముందు ఉంచాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని సూపరింటెండెంట్ అధికారులను కాంట్రాక్టర్ ఆదేశించాడు.
అనంతరం కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లుల్లో 81 బిల్లులను బోగస్‌గా బిల్లులుగా కొత్త సూపరింటెండెంట్ గుర్తించాడు. అందులో ఓ బిర్యానీ బిల్లు రూ. 3 లక్షలుగా ఉండడంతో సూపరింటెండెంట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పేషెంట్ వెల్ఫేర్ కమిటీతో సౌవిక్ ఆలం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులుగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.