బిషప్ ములక్కల్ నాపైనా లైంగిక దాడి చేశాడు.. నన్ ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

బిషప్ ములక్కల్ నాపైనా లైంగిక దాడి చేశాడు.. నన్ ఆవేదన

February 21, 2020

vfb cvgfbh

క్రైస్తవ సన్యాసినిపై  పలుమార్లు పాశవికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మతబోధకుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్ చుట్టూ పాపాల చిట్టా బిగుస్తోంది. అతని బారిన పడిన వాళ్లు ఒక్కొక్కరు బయటికొస్తున్నారు. ములక్కల్ తనపైనా లైంగిక దాడులకు పాల్పడినట్లు మరో సన్యాసిని వెల్లడించింది. అతడు బలవంతంగా ముద్దులు పెట్టి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. నన్‌పై అత్యాచారా కేసులో సాక్షిగా ఉన్న ఆమె పోలీసులకు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చింది. 

ty

‘2015-17 మధ్య కాలంలో ములక్కల్ నన్ను వేధించాడు. మేం అప్పుడు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకునేవాళ్లం. నేను నన్‌ను అనే సోయి లేకుండా అతడు బూతులు మాట్లాడేవాడు. ఓసారి మా కాన్వెంటుకు వచ్చిన నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టాడు…’ అని బాధితురాలు చెప్పింది. బయటికి చెబితే అతడు తనకు హాని చేస్తాడని అప్పట్లో చెప్పలేదని వివరించింది. అయితే ఇకపైనా తాను నన్‌గా ఉంటానని, అందుకే  అతనిపై కేసు పెట్టడం లేదని పేర్కొంది. మిషనరీస్ ఆఫ్ జీసన్ సంస్థకు చెందిన ములక్క్.. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని కొట్టాయం కాన్వెంటుకు చెందిన ఓ నన్ ఆరోపించడంతో రెండేళ్ల కింద కేసు నమోదైంది. గత ఏడాది పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు.