బిత్తిరి సత్తికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో.. - MicTv.in - Telugu News
mictv telugu

బిత్తిరి సత్తికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో..

August 15, 2020

Bithiri Sathi tests positive for coronavirus

కరోనా టచ్ చేయని మనిషి లేడేమో అని కంకణం కట్టుకోవడానికి కరోనా పూనుకుంటున్నట్టుంది. వైద్యులు, నర్సులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులను కరోనా విడిచిపెట్టడం లేదు. మీడియాలో పనిచేస్తున్నవారికి కూడా కరోనా సోకుతోంది. తాజాగా ప్రముఖ టీవీ నటుడు బిత్తిరి సత్తికి కరోనా సోకింది. పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా బిత్తిరి సత్తే ద్రువీకరించారు. 

తనకు కరోనా సోకిందని.. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. తనకు కరోనా ఎక్కడ సోకిందన్న విషయం కచ్చితంగా చెప్పలేనని సత్తి తెలిపారు. మీడియాలో పనిచేస్తున్నందున కొన్ని సందర్భాల్లో వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సి రావడంతో కరోనా సోకినట్టు భావిస్తున్నానని చెప్పారు. మీడియాలో పనిచేసే కొందరు సహచరులకు కూడా కరోనా సోకిందని వివరించారు. రెండు రోజుల క్రితం స్వల్పంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సత్తి స్పష్టంచేశారు. కాగా, ప్రస్తుతం సత్తి ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘గరం వార్తలు’ కార్యక్రమంలో నటిస్తున్నారు.