సినిమా చాన్సుల్లేక సత్తిని కొట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా చాన్సుల్లేక సత్తిని కొట్టాడు

November 27, 2017

తీన్మార్ బిత్తిరి సత్తిపై దాడి చేసిన సికింద్రాబాద్ యువకుడు ఏలూరి మణికంఠ గురించి మరిన్ని విస్మయం కలిగించే వివరాలు బయటికొచ్చాయి. అతనికి మానసిక స్థిమితం లేదని దగ్గరి బంధువులు చెప్పారు. మణికంఠ సినిమాల్లో, ప్రముఖ టీవీ ప్రోగ్రాంలలో అవకాశాలు దొరక్క తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడని, చికిత్స కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడని తెలిపారు. ఆదివారం కూడా అతడు ఇంటి వద్ద ఒక వ్యక్తితో గొడవపడి కొట్టాడని తెలిపారు.

 

తాను  సినిమా దర్శకుడిని కావడికి రెడీగా ఉన్నానని, అయితే సత్తిని కొట్టి, వీ6 చానల్‌ను మూసేశాకే సినిమా తీస్తానని మణికంఠ పోలీసులుకు కూడా చెప్పడం గమనార్హం. గుర్తింపు రాలేదనే ఆందోళ చెందేవారు సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులపై దాడి చేస్తుంటారని, జనం దృష్టిలో పడడటానికి కొన్ని సందర్భాల్లో ఎలాంటి నేరాలకైనా పాల్పడతారని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.