బిత్తిరి సత్తిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు. - MicTv.in - Telugu News
mictv telugu

బిత్తిరి సత్తిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు.

November 27, 2017

తెలంగాణ యాసతో, చక్కని సటైర్లతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న బిత్తిరి సత్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయనను వెంటనే స్టార్ ఆస్పత్రికి తరలించారు. సత్తి తను పనిచేస్తున్న వీ6 టీవీ చానల్ కార్యాలయం వద్ద కారు దిగి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన  వ్యక్తులు అతనిపై దాడి చేశారు..

సత్తి ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. దుండగులు.. ‘జైభారత్.. జై భారత్’ అని నినాదాలు చేశారు. మద్యం మత్తులో ఉన్న వారికి చానల్ సిబ్బంది తమ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది