బిత్తిరి సత్తిని కొట్టింది పిచ్చోడే.. మెంటల్ ఆస్పత్రికి తరలిస్తున్నాం..   - MicTv.in - Telugu News
mictv telugu

బిత్తిరి సత్తిని కొట్టింది పిచ్చోడే.. మెంటల్ ఆస్పత్రికి తరలిస్తున్నాం..  

November 28, 2017

తీన్మార్ బిత్తిరి సత్తిపై సోమవారం వీ6 చానల్ ముందు దాడి చేసిన సికింద్రాబాద్‌వాసి ఏలూరి మణికంఠ నిజంగానే ఉన్మాది అని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. అతడు మానసిక స్థిమితం లేక అందరితో గొడవ పడుతున్నారని చెప్పారు.

మణికంఠ సత్తిపై దాడి చేయడానికి ముందు తన చెల్లిని, తల్లిని కూడా కొట్టాడని, ఆదివారం పొరుగుంటి వ్యక్తిని కొట్టాడని తెలిపారు. సినిమాల్లో అవకాశాల్లేక అతడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని, దీంతో ఏం చేయాలో పాలుపోక సత్తిపై దాడి చేశాడని తెలిపారు. మణికంఠను తిరిగి మామూలు మనిషిని చేయడానికి ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు.

గాంధీ తాతను కాను..

మణికంఠ సత్తిపై దాడి చేయడానికి ముందు.. తాను గాంధీ తాతను కాదని అరిచాడు. ‘సత్తి తెలంగాణ భాషను ఎట్లపడితే అట్ల మాట్లాడితే గాంధీ గాంధీ తాత లెక్క ఊకే చూస్తా ఉండను.. ఏయ్.. నేను ఒక్కణ్నే ఇక్కడికి వచ్చా.. సత్తిని కొట్టాలని ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నా.. ఇక్కడికి  ఇంతకుముందు కూడా వచ్చా.. ’ అని అన్నాడు.