దీపావళికి వచ్చేస్తున్న 'తుపాకీ రాముడు' - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళికి వచ్చేస్తున్న ‘తుపాకీ రాముడు’

October 9, 2019

తీన్మార్ ప్రోగ్రాంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి త్వరలోనే హీరోగా కనిపించబోతున్నాడు. టీవీ షోలు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోన్న సత్తి ఫుల్ లెంగ్త్ హీరోగా ‘తుపాకీ రాముడు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాను టీఆర్ఎస్ ఎమ్యెల్యే రసమయి బాలకిషన్ ‘రసమయి ఫిలిమ్స్’ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. బతుకమ్మ చిత్రాన్ని తెరకెక్కించిన టి.ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామగుండం, గోదావరిఖని పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.