కాకరతో మేలు.. - MicTv.in - Telugu News
mictv telugu

కాకరతో మేలు..

August 21, 2017

కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కాకరను తినడం మానేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

  1. కాకరకాయ శరీరానికి మంచిది. బ్రకోలీతో పోలిస్తే బీటా కెరోటిన్ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. కాకరలోని  విటమిన్ ఎ శరీరానికి తగిన శక్తినిస్తుంది. 
  2. కాకరలోని కాల్షియం దంతాలకు బలాన్ని చేకూరుస్తుంది.  
  3. ఇందులో పొటాషియం నరాల వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. హృద్రోగాన్ని దూరం చేస్తుంది.
  1. కాకరలోని చాపన్టిన్ ధాతువులు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. ఇవి చక్కెర వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.
  2. కాకరలో బీ విటమిన్ తోపాటు, మెగ్నీషియం, పాస్పరస్ మాంగనీస్, వంటి పీచు వంటి పోషకాలు ఉంటాయి.
  3. వారానికి ఒకసారైనా కాకరకాయ రసం  తాగితే  ఉదర సమస్యలు రావు. కాకర గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  4. కాకరకాయ రసాన్ని నిమ్మరసంతో కలిపి పరిగడుపున తాగితే మెుటిమలు,  చర్మవ్యాధులు నయమవుతాయి.
  5. కాకర రసాన్ని, జీలకర్ర పొడిని కలుపుకుని తలకు పట్టిస్తే చుండ్రు పోతుంది.  జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.