మందు బాబులకు చేదు వార్త - MicTv.in - Telugu News
mictv telugu

మందు బాబులకు చేదు వార్త

March 17, 2022

 

jjj

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు చేదు వార్త తెలిపింది. హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్‌లో రెండు రోజులపాటు (17 సాయంత్రం నుంచి 19 ఉదయం వరకు) మద్యం షాపులను తెరవద్దని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి (శనివారం) ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

jjj

ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ‘హోలీ పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలి. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని స్టార్‌ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు బంద్ చేయాలి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కావున మందుబాబులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి” అని అన్నారు.

మరోవైపు.. గుర్తు తెలియని వ్యక్తులు, స్థలాలు, వాహనాలపై రంగులు లేదా నీళ్లు చల్లడం, రోడ్లపై రంగులు అద్ది చికాకు కలిగించడం వంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సీపీ భగవత్ హెచ్చరించారు.