సామాన్యులకు చేదు వార్త.. మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్యులకు చేదు వార్త.. మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర

May 7, 2022

దేశ వ్యాప్తంగా గతకొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు మొదలుకొని కూరగాయలు, చికెన్, వంటనూనె, సబ్బుల వరకు ధరలు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. శనివారం చమురు సంస్థలు మరో చేదు వార్తను చెప్పాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ ప్రకటనతో ఇప్పటికే మార్కెట్లో అన్ని ధరలు పెరిగి, అల్లాడుతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడినట్టు అయింది.

ఇక, పెరిగిన ధరతో సబ్సిడీ  వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,052కి చేరుకుంది. ఈ ధర తక్షణమే అమల్లోకి వస్తుందని చమురు సంస్థల అధికారులు తెలిపారు. డెలివరీ బాయ్ చార్జీలతో కలుపుకుంటే  సబ్సిడీ బండ ధర రూ. 1100 రౌండ్ ఫిగర్ చేరుకున్నట్టే.  ఇటీవలే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరుకుంది.