విజయంతో ‘తుపాకీరాముడు’..దీపావళికి విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

విజయంతో ‘తుపాకీరాముడు’..దీపావళికి విడుదల

October 18, 2019

Bittiri satti selfee with vijay devarakonda.

తీన్మార్ ప్రోగ్రాంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి త్వరలోనే హీరోగా కనిపించబోతున్నాడు. టీవీ షోలు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోన్న సత్తి ఫుల్ లెంగ్త్ హీరోగా ‘తుపాకీ రాముడు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాను టీఆర్ఎస్ ఎమ్యెల్యే రసమయి బాలకిషన్ ‘రసమయి ఫిలిమ్స్’ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. బతుకమ్మ చిత్రాన్ని తెరకెక్కించిన టి.ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామగుండం, గోదావరిఖని పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్తి.. విజయ్ దేవరకొండను కలిశాడు. విజయ్ కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. ‘విజయంతో తుపాకీరాముడు – అక్టోబర్ 25th విడుదల’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.