తుపాకీ రాములుగా బిత్తిరి సత్తి - MicTv.in - Telugu News
mictv telugu

తుపాకీ రాములుగా బిత్తిరి సత్తి

November 22, 2017

తెలంగాణ యాసతో, వెటకారాలతో అందరినీ అలరిస్తున్న తీన్మార్ బిత్తిరి సత్తి ఇక వెండితెరపై హీరోగా సందడి చేయనున్నాడు. ఇప్పటివరకు టీవీ ప్రోగ్రాములు, సినిమాల్లో చిన్నచిన్న పాత్రలతో మెప్పించి సత్తి హీరోగా ‘తుపాకీ రాములు’ పేరుతో సినా తీస్తున్నారు. తెలంగాణలో తమాషా మచ్చుట్లు చెప్పే తుపాకీ రాముడిని దృష్టిలో ఉంచుకుని కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది.  సత్తి ఇకిలింపులు, చేతిమధ్యవేలు మడతపెట్టడం, కళ్లను విచిత్రంగా తిప్పడం వంటి మేనేరిజాలు ఇందులోనూ కనిపిస్తాయని సమాచారం. రామగుండం, గోదావరిఖని, జనగామ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సత్తికి తగ్గట్టే ఈ సినిమాలోని సన్నివేశాలు చాలావరకు గ్రామాల్లోనే ఉంటాయి.  రసమయి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీఆర్‌ఎస్ ఎమ్యెల్యే రసమయి బాలకిషన్ నిర్మాత కాగా, ప్రభాకర్ దర్శకుడు. ప్రభాకర్ గతంలో ‘బతుకమ్మ’ సినిమా తీశాడు. దయా నర్సింగ్ సహాయ దర్శకుడు.