వాడు చెవులు కోసుకుంటే వీడు ముక్కు కోసుకున్నాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

వాడు చెవులు కోసుకుంటే వీడు ముక్కు కోసుకున్నాడు.. 

September 26, 2020

Bizarre! Brazil's Tattoo Artist Gets His Nose Removed To Look Like 'human Satan'

ఈమధ్య కొందరు పచ్చబొట్ల మోజులో పడి ఒళ్లంతా సందులేకుండా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. ఒంటిమీద ఎక్కడో ఓచోట పొడిపించుకునేవారు కొందరైతే.. చాలామంది విచ్చలవిడిగా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అంతేకాకుండా చెవులకు, ముక్కులకు, నాలుకకు, కను బొమ్మల్లో, చివరికి ప్రైవేట్ ప్లేసులో కూడా రింగులు వేసుకుని మురిసిపోతున్నారు. అయితే ఓ వ్యక్తి ఈ మోజులో పడి రాక్షస ముఖంలా తన ముఖాన్ని మార్చుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా తన ముక్కునే కోసుకున్నాడు. భ‌యంక‌ర‌మైన తన కొత్త రూపాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ప్ర‌పంచానికి త‌న పేరును ‘డెవిల్ ప్రాడో’గా ప‌రిచ‌యం చేసుకుంటున్నాడు. 

బ్రెజిల్ దేశానికి చెందిన అతని పేరు మైకెల్ ఫ‌రోడో ప్రాడో. అతను ఓ టాటూ ఆర్టిస్టు. అత‌డి భార్య, స్నేహితులు కూడా టాటూ ఆర్టిస్టులే కావ‌డంతో.. మైకేల్ శ‌రీర‌మంతా ప‌చ్చ‌బొట్లు పొడిపించుకున్నాడు. అయినా అత‌డికి ఏదో లోటుగా అనిపించింది. ఇంకేదైనా కొత్త‌గా ట్రై చేయాల‌నుకున్నాడు. సైతాన్‌గా అవ‌తరించాల‌ని భావించాడు. ఇందుకోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆప‌రేష‌న్లు చేయించుకున్నాడు. ఎట్ట‌కేల‌కు ముక్కును కూడా తొల‌గించుకున్నాడు. కళ్లల్లోని తెల్లగుడ్లను సైతం నల్లగా మార్చుకున్నాడు. త‌ల మీద కొమ్ములు, వికృతంగా మార్చుకున్న ముఖం, కోసేసిన ముక్కుతో నిజంగానే ద‌య్యంలా తయారయ్యాడు. పసివాళ్లు ఎవరైనా అతన్ని చూశారంటే జడుసుకోవాల్సిందే. కాగా, ప్ర‌పంచంలోనే నాసికాన్ని తొల‌గించుకున్న మూడో వ్య‌క్తిగా మైఖేల్ అవ‌త‌రించాడు. మొన్నా మ‌ధ్య‌ ఓ వ్య‌క్తి త‌న చెవుల‌ను క‌త్తిరించి జాడీలో భ‌ద్ర‌ప‌రుచుకున్న విషయం తెలిసిందే.