ఒకే బంతికి రెండు విధాలుగా అవుట్ అయిన రషీద్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే బంతికి రెండు విధాలుగా అవుట్ అయిన రషీద్ ఖాన్

October 14, 2020

Bizarre incident unfolds as Rashid Khan gets out twice

మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సన్ రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ ఒకే బంతికి రెండు విధాలా అవుట్ అయ్యాడు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 

17.4 వ ఓవర్లో బంతికి విజయ్ శంకర్ (12) ఔట్ అయ్యాడు. అప్పుడు రషీద్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. 18.6 వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన బంతికి రషీద్ ఖాన్ బ్యాట్ జులిపించాడు. ఆ బాల్ సీదా చెన్నై ఆటగాడి చేతుల్లోకి వెళ్ళింది. అలాగే రాష్ర్డ్ ఖాన్ కాలు వికెట్లకి తాకింది. దీంతో రషీద్ ఖాన్ హిట్ వికెట్ అయ్యాడు. అదే బంతికి క్యాచ్ అవుట్ కూడా అయ్యాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలిచింది.