పెళ్లి టైంలో ప్రియురాలికి హ్యాండిచ్చిన ఎమ్మెల్యే
mictv telugu

పెళ్లి టైంలో ప్రియురాలికి హ్యాండిచ్చిన ఎమ్మెల్యే

June 18, 2022

bjd MLA handing over to girlfriend at wedding time

ఓ ఎమ్మెల్యే తనను ప్రేమ పేరుతో వంచించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా పెళ్లి చేసుకునే సమయానికి చేయిచ్చాడని ప్రియురాలు కేసు పెట్టడానికి సిద్ధపడింది. ఈ ఘటన ఒడిషాలో జరిగింది. ఎమ్మెల్యే ప్రియురాలు అని చెప్పుకుంటున్న సోమాలికా దాస్ అనే అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం.. ‘జగత్‌సింగ్ పూర్‌‌కు చెందిన బీజేడీ ఎమ్మెల్యే బిజయ శంకర దాస్‌, నేను ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి మే నెల 17న రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నాం. వివాహానికి శుక్రవారం స్లాట్ ఇచ్చారు అధికారులు. వారు చెప్పిన సమయానికి నేను ఆఫీసుకు వచ్చాను. కానీ, ఎమ్మెల్యే రాలేదు. దాదాపు మూడు గంటలు వేచి చూశా వస్తారేమోనని. రాకపోవడంతో నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. ఈ విషయంలో ఎమ్మెల్యే సోదరుడు నన్ను బెదిరించాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను బిజయకు ఫోన్ చేస్తే తీయడం లేదు. అతను నన్ను మోసం అయినా చేశాడు లేదా ఇంకో అమ్మాయితో ప్రేమలో అయినా పడి ఉంటాడు. నన్ను మోసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాన’ని వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే వివరణ కోరగా, సోమాలికా వ్యాఖ్యలను ఖండించారు. ‘మేము పెళ్లి కోసం స్లాట్ బుక్ చేసుకున్న మాట వాస్తవమే. అయితే స్లాట్ బుక్ అయిన తర్వాత 90 రోజుల వరకు గడువుంటుంది. మేం దరఖాస్తు చేసి 30 రోజులే అయింది కాబట్టి ఇంకా 60 రోజుల సమయం మిగిలి ఉంది. అలోపు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. శుక్రవారం పెళ్లి ఉందన్న సంగతి నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యేనే ఇలాంటి పనులు చేయడంపై నియోజకవర్గ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.