జీజేపీ వర్గీయులు త్రిపుర ఎన్నికల్లో గెలిచామన్న ధీమాతో విగ్రహాల విధ్యంసకాండకు తెగబడుతున్నారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన మరువకముందే తాజాగా తమిళనాడులో మరో మహనీయుడి విగ్రహాన్ని కూల్చివేశారు. తమిళనాడులోని వెల్లూరులో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగానే స్థానికులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. విగ్రహంలోని ముక్కు భాగాన్ని పాడు చేశారు.
ఇద్దరు నిందితుల్లో ఒకరు బీజేపీ నేతగా గుర్తించారు. ఈ ఘటనపై పెరియర్ మద్దతుదారులు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.