BJP Action Plan For 2023Elections
mictv telugu

మూడ్‌లోకి వెళ్లిపోయారు

November 14, 2022

 

తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. మిషన్ 2023కి పక్కాగా ప్లాన్ చేస్తుంది.పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఆపరేషన్ ఆకర్ష్‌ని స్పీడప్ చేయబోతోంది.కొంతమంది ముఖ్యుల్ని పార్టీలో చేర్చుకోవడమే టార్గెట్‌గా అడుగులు వేస్తుంది.ఇందుకోసం ఆ మూడు రోజులే కీలకంగా మారాయి. ఈ మూడ్రోజుల సమావేశాల్లో తెలంగాణ బీజేపీ ఏం చేయబోతోంది.?

 

కీలక సమావేశాలు

తెలంగాణ బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై నజర్ పెట్టింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.ఈ నెల 21నుంచి 23 తేదీదాకా బీజేపీ ముఖ్యనేతలకు ట్రైనింగ్ ఇవ్వబోతోంది. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడం ఎలా? ప్రజల్లోకి ఎలావెళ్లాలి?బూత్ లెవల్లో ఏం చేయాలి? అనే దానిపై చర్చిస్తారు. ఏ నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది? గెలుపుకోసం ఇప్పటినుంచే చేయాల్సిన కార్యాచరణ ఏంటి? అనే అంశాలపై చర్చిస్తారు.2023 అసెంబ్లీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుతారు. బీజేపీ అగ్రనేతలు మిషన్ తెలంగాణపై కీలక సూచనలు చేయనున్నారు.

ఐదో విడత యాత్ర

నవంబర్ చివరివారంలో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. యాత్ర కొనసాగిస్తూనే నియోజకవర్గాల్లో బలమైన నాయకులకోసం అన్వేషించాలని లోకల్ కేడర్‌ని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు ముఖ్యనేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

మిషన్ తెలంగాణ

2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. మునుగోడు చేజారినా..అంతకుమించిన వ్యూహాంతో ముందుకెళ్లాలని చూస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ఉప ఎన్నికల ద్వారా సంకేతాలు పంపింది. కాంగ్రెస్‌ను అసలు సీన్‌లో లేకుండా చేస్తోంది. 119 నియోజకవర్గాలపై కమలనాథులు దృష్టి పెట్టారు. బీజేపీకి పట్టున్న స్థానాలు ఏంటి, వీక్ ఉన్న నియోజకవర్గాలు ఏంటి అనేదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపుకోసం పక్కా వ్యూహాలకు పదనుపెడుతున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలపై కన్నేశారు. ఆపరేషన్ కమలంతో వీరికి గాలం వేయాలని చూస్తున్నారు.