BJP Ahead In 4 Seats, Minor Lead For KCR's Party In Telangana
mictv telugu

6 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు.. 4 స్థానాల్లో బీజేపీదే హవా

November 6, 2022

దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాల ఉత్కంఠ నెలకొంది. నేడు తెలంగాణలోని మునుగోడుతో సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సంబంధించిన ఫలితాలు ఈరోజు సాయంత్రంలోగా వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం.. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 2022 నవంబర్ 3న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఆదివారం కౌంటింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోలా గోక్రానాథ్, హర్యానా రాష్ట్రంలోని ఆదంపూర్, బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్, ఒడిశాలోని ధాంనగర్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ఆధిక్యంలో ఉన్నారు.

మిగతా అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. బీహార్ రాష్ట్రంలోని మోకామా అసెంబ్లీ సెగ్మెంటులో రాష్ట్రీయ జనతాదళ్, మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.