వ్యవసాయ బిల్లుల నిరసకారులపై బీజేపీ దాడి! - MicTv.in - Telugu News
mictv telugu

వ్యవసాయ బిల్లుల నిరసకారులపై బీజేపీ దాడి!

September 26, 2020

Bjp alleged attack on agriculture bills protest rally

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులతో తాము తీవ్రంగా నష్టపోతామని, వాటిని వాపసు తీసుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు కదం తొక్కుతున్నారు. పంజాబ్, హరియాణాలో ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. అయితే బిల్లులతో ఎవరికీ నష్టం లేని బీజేపీ చెబుతోంది.  ఈ నేపథ్యంలో బిహార్ రాజధాని పట్నాలో జరిగిన నిరసన ర్యాలీపై బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న వారు దాడి చేశారు. ర్యాలీ వాహనాన్ని అడ్డుకుని కర్రలతో విరుచుకుపడ్డారు. పలువరికి గాయాలయ్యాయి. 

జన్ అధికార్ పార్టీ(జేఏపీ) నేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ఈ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వీరచంద్ పాటిల్ రోడ్డుని బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్తుండగా కొందరు దాడి చేశారు. ‘నరేంద్ర మోదీ జిందాబాద్‘, ‘బీజేపీ జిందాబాద్’ అని గట్టిగా కేకలు వేశారు. దాడిపై పప్పూ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గూండాలే ఈ దురాగతానికి పాల్పడ్డారని, ఎన్నికల్లో రైతులు దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరించారు. అయితే దుశ్చర్యతో తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. ఆర్జేడీ, జేఏపీలే కలిసి తమపై దాడి చేశాయన్నారు.