ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ‘ నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ పంజాబ్లో కూడా గెలిచేది. కానీ, రైతు వ్యతిరేక చట్టాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పంజాబ్ రైతులు మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టుకున్న అమరీందర్ తర్వాత బీజేపీతో జట్టుకట్టడం కూడా ప్రజలకు నచ్చలేదు. అందుకే ప్రత్యమ్నాయంగా ఆప్ పార్టీని గెలిపించారు. ఇక యూపీలో అఖిలేష్ యాదవ్ గతం కంటే బాగా పోరాడారు. ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దని అఖిలేష్ని కోరుతున్నా. మహారాష్ట్రలో తమ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే మోదీకి రెండున్నరేళ్లు వేచి ఉండక తప్పద’ని వ్యాఖ్యానించారు.