BJP announces huge offer for Shiv Sena rebel MLAs
mictv telugu

శివసేన రెబెల్స్‌కు రెండు పక్షాల భారీ ఆఫర్లు.. బీజేపీ ఆఫర్‌కు మొగ్గు?

June 23, 2022

 

BJP announces huge offer for Shiv Sena rebel MLAs

శివసేన పార్టీ నుంచి తిరుగుబాటు చేసి గౌహతిలో ఉన్న ఏక్ నాథ్ షిండే వర్గానికి అటు శివసేన, ఇటు బీజేపీ రెండూ భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఉన్న బీజేపీ.. కేబినెట్‌లో ఎనిమిది మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేసింది. ఎంపీలు కూడా వస్తే కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ నేత, అసోం మంత్రి అశోక్ సింఘాల్ హోటల్ వద్దకు చేరుకొని ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు శివసేన కూడా ఆఫర్లు ఇస్తోంది. మహా వికాస్ అఘాడీలో భాగంగా కాంగ్రెస్‌తో జట్టుకట్టడం నచ్చక తిరుగుబాటు చేశారని అర్ధం చేసుకున్న అధిష్టానం.. మీకోసం కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమని ప్రకటించింది. అంతేకాక, శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. రెబెల్స్‌లో 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. ఇదికాక, హోటల్‌లో ఉన్న ఓ రెబెల్ ఎమ్మెల్యే.. ‘మీకు ఉద్ధవ్ ఏం తక్కువ చేశారు. బీజేపీని నమ్మి మోసపోకండి’ అని ఏక్ నాథ్ షిండేకు సలహా ఇచ్చినట్టు సమాచారం.