BJP Action Plan On CBI Notice To MLC Kavitha Delhi Liquor scam
mictv telugu

బీజేపీ మళ్లీ దూకుడు పెంచబోతుందా?

December 3, 2022

BJP Auction Plan On CBI Notice To Kavitha

సైలెంట్‌గా ఉన్న బీజేపీ తెలంగాణలో మళ్లీ దూకుడు పెంచుబోతుందా?ఢిల్లీ లిక్కర్ కేసుని అస్త్రంగా వాడుకోబోతుందా?టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులతో జోరు పెంచబోతుందా?బీజేపీ నేతల వ్యాఖ్యల్ని చూస్తే అవుననే అనిపిస్తుంది.

లిక్కర్ అస్త్రం

ఎమ్మెల్యేల ఎర్ర కేసు తర్వాత తెలంగాణలో బీజేపీ సైలెంట్ అయింది. దీనికితోడు మునుగోడు ఓటమి తర్వాత దూకుడు బాగా తగ్గింది. అంతకుముందులా బీజేపీ వ్యవహరించలేకపోయింది. ఫామ్‌హౌజ్ కేసు తర్వాత ఆ పార్టీ నేతల్లో స్పీడ్ బాగా తగ్గింది. ఈ కేసుకు కౌంటర్ ఇచ్చేందుకే సమయం అంతా కేటాయించారు. సిట్ విచారణతో కాస్త డిఫెన్స్‌లో పడ్డారు. టీఆరఎస్‌ని అంతకుముందులా డీల్ చేయలేకపోయారని టాక్ వినిపించింది. ఇప్పుడు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. తెలంగాణలో మళ్లీ దూకుడు పెంచేలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి.

ఢిల్లీ నుంచి మొదలైంది…

ఎమ్మెల్సీ కవిత నోటీసులు వచ్చీరాగానే ఢిల్లీ నుంచి బీజేపీ ఎటాక్ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముగ్గురు సీఎంలు కేసీఆర్ , అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ మాన్ ప్రభుత్వాల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. సీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలన్నారు.”సీఎం కేసీఆర్ ,కవిత పదే పదే ఢిల్లీ ఎందుకు వచ్చారో చెప్పాలి. చట్టం ముందు అందరూ సమానమే.సీబీఐ విచారణకు కవిత సహకరించాలి” అని తరుణ్ చుగ్ అన్నారు.

ఎటాకింగ్ మోడ్
తరుణ్ చుగ్ ఒక్కరే కాదు రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శల డోస్ పెంచుతున్నారు. మళ్లీ ఎటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో టీఆర్ఎస్‌ని కార్నర్ చేయాలని చూస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ 6న వివరణ ఇవ్వాలని పేర్కొంది. సీబీఐ నోటీసులు అందాయన్న కవిత..6న హైదరాబాద్‌లోని ఇంట్లోనే సీబీఐ అధికారుల్ని కలుస్తానని చెప్పారు.

 

ఇది కూడా చదవండి :అమరుల స్తూపం కాంట్రాక్టు ఆంధ్రవాళ్లకా ? :రేవంత్ రెడ్డి

ఇది కూడా చదవండి : అందుకే హిందువులకు పిల్లలు తక్కువ.. ముస్లిం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు