టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే స్పెషల్ ఆపరేషన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే స్పెషల్ ఆపరేషన్‌

October 27, 2022

BJP came up with a conspiracy angle to buy TRS MLAs

 

 

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. హైదరాబాద్‌లో భారీ పొలిటికల్ ప్లాన్ బ్లాస్ట్ అయ్యింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ జాతీయ పార్టీకి చెందిన బ్రోకర్లు రెడ్‌హ్యాండెడ్‌గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా బీజేపీ పెద్దలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చారని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్ చెప్పారు . ‘మీకు ఏమి కావాలన్నా మేం చూసుకుంటాం. పార్టీ మారండి’ అంటూ వారు ఆశ పెడుతూ వచ్చారట. ఈ ఆఫర్లపై నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అగ్రనేతలకు సమాచారమివ్వగా..  పక్కా ప్రణాళికతో బీజేపీ నేతలను తాము పార్టీ మారుతామంటూ నమ్మించారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్వ‌యనా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అగ్రనేతలకు, పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో పోలీసులు రైడ్ చేసి వారి వ‌ద్ద నుండి దాదాపు రూ.15 కోట్లపైగా నగదును పోలీసులు సీజ్ చేశారు.దీనిపై  సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టామని వెల్లడించారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని వారు ప్రలోభ పెడుతున్నారని కాల్ చేసి చెప్పారన్నారు.

తమకు వచ్చిన సమాచారం మేరకు తాము ఫామ్‌హౌజ్‌కు వెళ్లామని , ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురిని గుర్తించామని చెప్పారు. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి.. తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామిజీ.. హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపు కోసం ఎమ్మెల్యేలతో చర్చల కోసం వచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. ప్రలోభాల ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు తనిఖీలు నిర్వహించామన్నారు

 

మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ‌తంలో రేవంత్ రెడ్డిని ఇరికించిన‌ట్లే కొనుగొలుకు వ‌చ్చిన స్వామిజీల‌ను భ‌లే ఇరికించారు. ఈ కొనుగోలు వ్య‌వ‌హ‌రంపై టీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.