అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా చూసిన ప్రభావం మన దేశంలో ఉండదని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనాను కట్టడి చేయడకపోవడం, ప్రజల ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టడం వల్లే ట్రంప్ ఓడిపోయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
కరోనాను నియంత్రించకపోవడం వల్లే ట్రంప్ ఓడిపోయారని, అయితే మోదీ మాత్రం ఆ రోగంపై విజయం సాధించారని చెప్పారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్భంగాలో జరిగిన ఎన్నికల సభలో నడ్డా ప్రసంగించారు. ‘ట్రంప్ ఓడిపోవడం సహజమే. కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై విజయం సాధించారు. 130 కోట్ల మందిని ఆ వ్యాధి నుంచి కాపాడారు. అమెరికా ఎన్నికల్లో కరోనానే ప్రధాన్య అంశంగా మారింది…’ అని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్ల హోరాహోరీగ తలపడిన ట్రంప్ ఓటమి ఖాయమవడం తెలిసిందే. కొన్ని చోట్ల కౌంటింగ్ జరుతుండడంతో తుది ఫలితాలను ఇంకా వెల్లడించడం లేదు. గెలవడానికి కావాలసిన మేజిక్ ఫిగర్ 270కి బైడెన్ కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉండగా, ట్రంప్ 214 ఓట్ల వద్దే ఆగిపోయాడరు.