బాల్ బ్యాట్.. గన్ బుల్లెట్.. పాకిస్తాన్ -ఇండియా… ముందు రెండింటి మ్యాచింగ్స్ కు వోకే..మూడోది అస్సలు మ్యాచ్ కాదు. క్షణం కూడా పడదు. సరిహద్దుల్లో ఒకరికి ఒకరు తూటాలు దించుకోవాల్సిందే..దెబ్బ కు దెబ్బ తీయాల్సిందే..ఎప్పుడూ ఇదే యావ…కానీ ఒక విషయంలో మాత్రం పాకిస్థాన్ -భారత్ ది ఒకటే మాట. ఎంతపడకపోయినా ఆ విషయంలో పాలకులవి చిలుక పలుకులే..ఇంతకీ ఏంటా మేటర్..?
పాకిస్థాన్ అంటే కమలనాథులు ఒంటి కాలుపై లేస్తారు. కనిపిస్తే పొడిచేసేంతా రేంజ్ లో ఊగిపోతారు. అన్ని విషయాల్లో ఇంతే.కానీ క్రికెట్ విషయానికి వస్తే..కాస్తా తగ్గుతున్నారు..అధికారంలో ఉన్నామనో..లేదా ఆట పై మమకారమోగానీ జనం ఆలోచనలకు దగ్గరగా ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు పాకిస్థాన్ కు బుద్ది వచ్చేదాకా క్రికెట్ ఆడొద్దు..అనే వారు. కానీ ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో మార్పు వచ్చింది. ఆట ఆటే తూటా తూటే అంటున్నారు. ఈ మాటలన్నది మామూలు లీడర్ కాదు… బీజేపీ బాద్ షా..అమిత్ షా…
ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ కు ఒకరోజు ముందు బీజేపీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా – పాకిస్థాన్ మధ్య ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ భవిష్యత్తులోనూ కొనసాగుతాయన్నారు. ఇండియా మాత్రం పాకిస్థాన్ వెళ్లి మ్యాచ్ ఆడబోదని.. అలాగే పాకిస్థాన్ కూడా ఇండియా వచ్చి మ్యాచ్ ఆడదన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్స్ లో ఆడకుండా నిష్క్రమించాలా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. వోకే వోకే… ఆటను ఆటగా చూడటం గ్రేట్.మరి ఆ దేశపు క్రికెటర్లు ఇక్కడకు..ఈ దేశం క్రికెటర్లు అక్కడికి వెళ్తే తప్పేంటి. సరే పాకిస్థాన్ అంటే అక్కడకు వెళ్తే ఇండియా క్రికెటర్లకు రక్షణ కల్పించలేదు. ఇందులో నో డౌట్..మరి పాకిస్థాన్ ఇక్కడకు ఎందుకు రావొద్దు..వస్తే సెక్యూరిటీ కల్పించే సత్తా ఉంది. ఎలాగూ మీ మాటలంటే బీజేపీ కార్యకర్తలకు వేదవాక్కు. తుచ తప్పక పాటిస్తారు. వాళ్లొచ్చినా లొల్లి చేయరు.శివసేనోళ్లు లొల్లి జేసినా వినపడదు.మరి ఇక్కడకు ఎందుకు రావొద్దు అంటున్నారో మిస్టర్ ఫర్ ఫెక్ట్ షాకే తెలియాలి.
Bjp chief/Amith sha/India/Pakisthan/Cricket