బీజేపీకి టాటాల నుంచి రూ.356 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి టాటాల నుంచి రూ.356 కోట్ల విరాళం

November 12, 2019

రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతాయన్న సంగతి తెలిసిందే. ప్రతి రాజకీయ పార్టీకి వివిధ సంస్థలు, ప్రజల నుంచి విరాళాలు అందుతూ ఉంటాయి. తాజాగా అధికార బీజేపీ పార్టీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో చెక్కు, ఆన్‌లైన్ రూపాల్లో వచ్చిన విరాళాల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది.

BJP

మొత్తం రూ.700కోట్లు విరాళంగా అందాయని నివేదికలో ప్రకటించింది. ఈ విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్‌ నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు’ నుంచే రావడం గమనార్హం. ఈ ట్రస్టు నుంచి రూ.356 కోట్లు సమకూరాయి. అలాగే ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు నుంచి రూ.54.25 కోట్ల విరాళాలు బీజేపీకి అందాయి. భారతీ గ్రూప్‌, హీరో మోటార్‌కార్ప్‌, ఓరియెంట్‌ సిమెంట్‌, జుబిలియంట్‌ ఫుడ్‌ వర్క్స్‌, డీఎల్‌ఎఫ్‌, జేకే టైర్స్‌ వంటి ఇతర కార్పొరేట్‌ సంస్థలు బీజేపీకి విరాళాలు అందించిన జాబితాలో ఉన్నాయి. రూ.20వేలు, అంతకు మించిన విరాళాలను కేవలం ఆన్‌లైన్‌లోనే తీసుకున్నట్లు బీజేపీ తెలిపింది. ఈ విరాళాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి వచ్చిన మొత్తాన్ని చేర్చకపోవడం చర్చనీయాంశం అవుతోంది.