డియర్ డిఫెన్స్ మినిస్టర్.. మీరు తప్పు చేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

డియర్ డిఫెన్స్ మినిస్టర్.. మీరు తప్పు చేశారు!

December 5, 2017

సరిహద్దుల్లో నిల్చొని ఉండే సైనికులను చూపించి జనాలను దబాయించే బీజేపీ పార్టీకి, ఓ నెటిజన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ముందు జవాన్లను గౌరవించడం నేర్చుకోండని లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. ఓఖీ తుఫాన్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి చెన్నై వెళ్లిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్..  అన్నాడీఎంకే నాయకులు ప్లస్ నేవి అధికారులతో సమావేశమయ్యారు.

ఆ మీటింగ్‌కు నేవిలో వైస్ అడ్మిరల్ స్థాయి అధికారితో సహా మిగతా ఉన్నతాధికారులు వచ్చారు. అయితే మీటింగ్ మొదలైనప్పటి నుంచి వాళ్లు నిల్చొనే ఉన్నారు. నిర్మల మేడమ్ అడిగిన ప్రశ్నలకు నిల్చొనే జవాబులు చెప్పారు. ఓ వైపు నేవి అధికారులు నిల్చొని ఉంటే అన్నాడిఎంకే లీడర్లు మాత్రం దర్జాగా సోఫాల్లో కూర్చున్నారు.

ఈ ఫోటోలను శ్రీవాస్త అనే ట్విట్టరియన్ తన అకౌంట్‌లో పోస్ట్ చేసి, ‘మేడం.. సైనికులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? సిగ్గు సిగ్గు’ అని నిర్మల సీతారామన్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు. దీనిపై రక్షణ మంత్రి అధికారిక ట్విట్టర్ హ్యాండ్లర్ స్పందించింది.

శ్రీవాస్త పోస్ట్ చేసిన ఫోటోలు మీటింగ్ మొదలైనప్పటివని, ఆ తర్వాత మేడం కుర్చీలు తెప్పించి నేవీ ఆఫీసర్లను కూర్చోబెట్టారని కవర్ చేశారు. అయితే నేవి అధికారులు నిల్చొనే నిర్మలతో మాట్లాడుతున్న ఇంకో ఫోటోను పోస్ట్ చేసిన శ్రీవాస్త, అబద్ధాలు చెప్పడం బంద్ చేసి, సైనికులను గౌరవించడం నేర్చుకోండని సలహా ఇచ్చాడు. ఈ కాన్వర్ జేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

అవును మరి సరిహద్దుల్లో నిల్చొని ఉన్న సైనికులను చూపించి జనాలను దబాయించే బీజేపీ నేతలు, అందరికంటే ముందు  జవాన్లను గౌరవిస్తే బాగుంటుంది.