క్రీస్తు వంశంపై విమర్శలు.. బీజేపీ జెండాలు దగ్ధం - MicTv.in - Telugu News
mictv telugu

క్రీస్తు వంశంపై విమర్శలు.. బీజేపీ జెండాలు దగ్ధం

April 16, 2018

క్రైస్తవులు ఆరాధించే ఏసుక్రీస్తు వంశంపై విమర్శలు సంధిస్తూ కొందరు పంచిపెట్టిన కరపత్రాలు ఏపీలోని చీరాల పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. వావివరుసల్లేని వంశంలో జన్మించిన ఏసును దేవుడిగా అంగీకరించాలా? ప్రతి హిందువు ఇంట్లో ఉండాల్సిన కరపత్రం ఇది అని కరపత్రాలపై రాశారు.

అయితే ఇది తమ మనోభావాలను కించపరచేలా ఉందని, బీజేపీ కార్యకర్తలే వీటిని పంచిపెట్టారని క్రైస్తవులు భగ్గుమన్నారు. ఆదివారం దళితులు, క్రైస్తవులు వీధుల్లోకొచ్చి బీజేపీ జెండాలను కుప్పబోసి తగలబెట్టారు. క్రైస్తవాన్ని విమర్శించేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జెండాలను తగలబెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే కరపత్రంలో ఉన్నవన్నీ నిజాలేనని, బైబిల్‌లోని చెప్పిన వాటినే అందులో రాశారని హిందుత్వ వాదులు అంటున్నారు. అయితే దేశంలో మతప్రచార హక్కు మాత్రమే ఉండిగాని, పరమతాన్ని విమర్శించే హక్క లేదు కనుక ఇలాంటి విమర్శలు సరికాదని క్రైస్తవులు వాదిస్తున్నారు.