మోదీ కోటలో బీజేపీకి దెబ్బ.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పరాజయం - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ కోటలో బీజేపీకి దెబ్బ.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పరాజయం

April 12, 2022

modi

ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గంలో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థలు కొందరు ఓడిపోయారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన సుధామా పటేల్‌ను స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణా సింగ్ భరీ మెజారిటీతో ఓడించారు. ఆమె స్థానికంగా పట్టున్న బ్రజేశ్ సింగ్ భార్య. వార‌ణాసి- చందౌలి, బ‌దౌళీ ఎమ్మెల్సీ సీటును ఆమె కైవసం చేసుకున్నారు. అన్నపూర్ణకు 4234 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కేవలం 170 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఉమేశ్ యాదవ్ 345 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. మరోపక్క ప్ర‌తాప్‌గ‌ఢ్ ఎమ్మెల్సీ స్థానంలోనూ బీజేపీ ఓడిపోయింది. అయోధ్య, బరాబంకి, గోరఖ్‌పూర్ తదితర స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.