‘బీజేపీ అహంకారానికి భారీ మూల్యం’..మమతా బెనర్జీ - MicTv.in - Telugu News
mictv telugu

‘బీజేపీ అహంకారానికి భారీ మూల్యం’..మమతా బెనర్జీ

November 28, 2019

బీజేపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన సంగతి తెల్సిందే. తాజాగా బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒకచోట గెలుపొందగా.. మరో రెండు చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

mamata.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్‌పూర్‌ సర్దార్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుపొందింది. కలియాగంజ్‌లో స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. ‘మితిమీరిన అహం, గర్వం మంచిది కాదు. బీజేపీ పార్టీకి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. బీజేపీ అహంకారానికి తగిన మూల్యమిది’ అని ఆమె వ్యాఖ్యానించారు.