కరీంనగర్ ప్రజలను కాపాడుకుంటా.. బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్ ప్రజలను కాపాడుకుంటా.. బండి సంజయ్

May 24, 2019

తన గెలుపు కోసం కృషి చేసిన వారందని కాపాడుకుంటానని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. నిన్న విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సంజయ్ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్‌పై 89,508 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. ‘ నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు. నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సేవచేస్తాను. వేములవాడ రాజన్న ఆశీస్సులతో గెలిచాను. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను. కేంద్రంలో ప్రజలు మళ్లీ మోదీ పాలన కోరుకున్నారు. అందుకే అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపొందింది’ అని సంజయ్ పేర్కొన్నారు.