‘అపశకునం మాటలు మాట్లాడొద్దురా.. పైన తథాస్తు దేవతలు ఉంటారు’ అని పెద్దలు హెచ్చిస్తుంటారు .దేవతల సంగతి పక్కన పెడితే కరోనా వైరస్ మాత్రమే కాచుకుని కూర్చుకుని ఉంటుంది. తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుని ఆమెకు కూడా అంటిస్తానని చెప్పిన బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది.
ఏదో ఒక రోజు తనకు ఆ జబ్బు వస్తుందని ఆయన అన్న మాట నిజమైది. అయితే ఆయన ప్రకటన చేసేనాటికే కరోనా వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంకు కరోనా అంటిస్తానని ఆయన ఆదివారం కిందట చెప్పారు. తాజాగా తనకు కరోనా వచ్చేసిందని ప్రకటించారు. తనకు చాలా నీరసంగా ఉందని, కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ ఫలితం వచ్చిందని హజ్రా తెలిపారు. గత నెల 27న ఆయన ఓ కార్యక్రమంలో మట్లాడుతూ కరోనా వ్యాఖ్యాలు చేశారు. కరోనా రోగుల సమస్యలను మమత పట్టించుకోవడం లేదని, ఆమెకు కరోనా వస్తే వారి గోడు అర్థమవుతుందని అంటూ ఆయన సీఎంకు కరోనా రావాలని శపించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది.