నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు తైలంగాణ హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. కేసుపై విచారణ జరుపుతున్న సిట్ నోటీసులపై స్టే గడువును పెంచింది. ఇదివరకు సోమవారం(డిసెంబర్ 5) దాకా ఇచ్చిన గడువును ఈ నెల 13వరకు పొడిగించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీఎస్ సంతోష్ సహకరిస్తారని ఈ కేసు నిందితుల సంభాషణల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పడం తెలిసిందే. అయితే ఎఫ్ఐఆర్లో తన పేరే లేనప్పుడు తననెలా విచారిస్తారని సంతోష్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లకు కోర్టు బెయిల్ ఇవ్వడం తెలిసిందే. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ వాసి జగ్గుస్వామికి కూడా హైకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. తనపై జారీ అయిన లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని ఆయన కోరగా కోర్టు అంగీకరించింది. టీఆర్ఎస్ను వీడి బేజేపీలో చేరితో వందల కోట్ల డబ్బులు ఇస్తామని, ఈడీ, సీబీఐ దాడులు ఉండవని అంటూ నిందితులు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్లు కేసు నమోదవడం తెలిసిందే.