కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

May 28, 2020

hvn vbhn

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న తనయుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈరోజు సాయంత్రం మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. 

దీంతో ఆమెను రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ఆమె తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.