తమిళనాడులో బీజేపీ నేతల నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత కుష్బూను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలపై వీసీకే అధ్యక్షుడు తిరుమావళన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంతసేపు ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. వీసీకే, బీజేపీ నేతల ఘర్షణ కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసలు భారీగా మోహరించారు.
తిరుమాళవన్కు వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టులను పలువురు నేతలు తప్పబట్టారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. కాగా తిరుమాళవన్ ఓ సభలో మహిళలను మనుస్మృతిని కించపరిచినట్లు ఆయన తన ప్రసంగంలో విమర్శించారు. మహిళలను కేవలం లైంగింక వాంచ కోసమే అన్నట్టుగా మనువు ట్రీట్ చేసినట్లు ఆరోపించారు. మనుస్మృతిపై నిషేధం విధించాలని తిరుమావలన్ కోరారు. దీంతో నిన్న కూడా తమిళనాడులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీసీకే నేతలు, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు.