కదిలే బస్సులో రోమియో లీడర్.. - MicTv.in - Telugu News
mictv telugu

కదిలే బస్సులో రోమియో లీడర్..

July 4, 2017

మహారాష్ట్రలో లోకల్ బీజేపీ లీడర్ బరితెగించాడు. పదిమందికి ఆదర్శంగా నేత దారితప్పాడు. కదిలే కదిలే బస్సులో మహిళను ముద్దు పెట్టుకున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది.

గడ్చిరోలి జిల్లా చంద్రాపూర్‌లో ఇది జరిగింది. లోకల్ లీడర్ రోమియోకి సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానిక బీజేపీ రవీంద్ర బవాన్‌థాడే దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు తెలిపింది. మహిళను ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించినట్టు ఆ దృశ్యాల్లో ఉంది. బస్సులో ప్రయాణికులంతా చూస్తుండగానే ఈవిధంగా ప్రవర్తించారు. స్థానిక బీజేపీ రవీంద్ర బవాన్‌థాడేపై బాధితురాలు రేప్‌ కేసు పెట్టడంతో ఆయన పరారయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రవీంద్ర తనను మోసం చేశాడని పోలీసులతో బాధితురాలు చెప్పింది. ఈ రౌడీ లీడర్ బాగోతంపై మాట్లాడేందుకు మహారాష్ట్ర బీజేపీ నేతలు నిరాకరిస్తున్నారు.