9 ఏళ్ల బాలికపై బీజేపీ నేత అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

9 ఏళ్ల బాలికపై బీజేపీ నేత అత్యాచారం

April 23, 2018

‘బీజేపీ నేతలకు ఏమైంది? వీరికి పెళ్లిళ్లు కాలేదా? భార్యలు లేరా? ఎందుకు మృగాళ్లుగా మారుతున్నారు?’ ఇటీవల తరచూ జనం సంధిస్తున్న ప్రశ్నలు ఇవి! ఉన్నావ్ రేప్ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్, కతువా రేప్ నిందితులకు మద్దతుగా బీజేపీ నేతల ర్యాలీల నేపథ్యంలో బీజేపీ నేతల అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా కదిలే రైల్లో ఒక బీజేపీ నేత 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతుడు గత ఎన్నికల్లో బీజేపీ తరఫులన అసెంబ్లీకి పోటీ చేయడం గమనార్హం.

 

తిరువనంతపురం నుంచి చెన్నై వెళ్తున్న రైల్లో కోయంబత్తూరు, ఈరోడ్ మధ్య శనివారం ఈ ఘోరం జరిగింది. బాలిక తన తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తోంది. మధ్య బెర్తులో పడుకుంది. కేపీ ప్రేమ్ అనంత్ అనే 57 ఏళ్ల న్యాయవాది, బీజేపీ నేత రాత్రి ఒంటిగంట సమయంలో రైలెక్కాడు. తర్వాత బాలిక వద్దకు వెళ్లి ముద్దుపెట్టుకున్నాడు. ఆమె ఛాతీని నలిపాడు. ఆమె నోటిని నొక్కేసి మరింత దారుణానికి తెగబడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, అరచి కేకలు వేసింది. కుటుంబసభ్యులు వెంటనే ఆ కామాంధుణ్ని పట్టుకున్నారు. తోటి ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేశారు. అయితే తాను పలుకుబడి ఉన్న లాయరునని, రాజకీయ నేతలు తనకు తెలసని అతడు చెప్పాడు. జనం పట్టించుకోకుడా చితగ్గొట్టి రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడు బాగా తాగి ఉన్నాడని, బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు పక్సో చట్టం కింద కేసుపెట్టామని పోలీసులు చెప్పారు. ప్రేమ్ అనంత్ 2006లో చెన్నె రాధాకృష్ణ నగర్  నుంచి అసెంబ్లీకి పోటీ చేశాడు.

త్రిపురలో 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల నేత ఘోరం..

త్రిపురలో ఖోవాయి జిల్లాలోనూ బీజేపీ నేత ఒకడు 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ (54) గత ఫిబ్రవరి 11న ఛంప్లాయ్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో తొలిసారి బాలికను కాటేశాడు. ఈ విషయం బయపడితే చంపేస్తానంటూ మరో మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతవారం కూడా ఫామ్‌హౌస్‌కు రావాలని చెప్పడంతో బాధితురాలు ఓర్చుకోలేక తన స్నేహితురాలకి చెప్పింది. తర్వాత విషయం పోలీసులకు తెలిసింది.  మనోజ్ ను అరెస్ట్ చేసి, పోక్సో చట్టంకింద కేసు పెట్టారు.