ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు..(వీడియో)

June 5, 2020

bjp

హరియాణా బీజేపీ నాయకురాలు సొనాలీ ఫొగాట్ ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతోంది. అసలేం జరిగిందంటే.. ఈరోజు ఆమె కొందరు రైతుల జాబితా తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అధికారిని కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెను సదరు అధికారి దూషించారు. 

దీంతో, ఆమె ఆయనను చెప్పుతో కొట్టారు. దీంతో సదరు అధికారి ఆమెను క్షమించమని కోరాడు. మీరు తీసుకొచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే అధికారం తనకులేదని వేడుకున్నారు. ఆ తర్వాత ఆమె పోలీసులను పిలిపించారు. అతడు వేడుకోవడంతో ఆయనపై ఫిర్యాదు చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్ టాక్ స్టార్ గా పేరున్న ఫొగాట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెల్సిందే.