మమత ఓ దెయ్యాల రాణి.. - MicTv.in - Telugu News
mictv telugu

మమత ఓ దెయ్యాల రాణి..

January 14, 2020

gjnvvn

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఓ బీజేపీ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఆమెను ఓ దెయ్యంతో పోల్చారు. ఆమెకు శ్రీలంకలోని రాక్షసి లంకిణి లక్షణాలు ఉన్నాయని, ఆమె దెయ్యాల రాణి అంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం-2019పై మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జీకి సంపూర్ణమైన దెయ్యాల లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఆమెలో మానవత్వ విలువలు, మహిళలకు ఉండాల్సిన లక్షణాలు మచ్చుకు కూడా లేవని మండిపడ్డారు. వేలాది మంది హిందువులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను ఆమె రక్షిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నేతలను మనం దెయ్యాలుగా పిలుస్తుంటాం అని చెప్పారు. ఆమె నాయకురాలు కాదు.. శ్రీలంకలోని రాక్షసి లంకిణి అని అభివర్ణించారు. 

ఓ దెయ్యానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ మమతకు ఉన్నాయని అన్నారు. బీజేపీ దేవతల పార్టీ అని.. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ రాక్షస జాతికి చెందినవని వ్యాఖ్యానించారు.  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నామని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని సురేంద్ర సింగ్ అన్నారు.